తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేవంత్‌రెడ్డికి రైతులంటే గౌరవం లేదు, వ్యవసాయంపై అవగాహన లేదు' - తెలంగాణలో హరీశ్​రావు ఎన్నికల ప్రచారం

Harish Rao Fires on Revanth Reddy : రేవంత్​రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతును రాజు చేశారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో భూముల విలువ పెరిగిందన్నారు. మంత్రి హరీశ్​రావు సమక్షంలో ఇవాళ బీజేపీ నేత రాములు బీఆర్ఎస్​లో చేరారు. ఆయనను మంత్రి హరీశ్​రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

Harish Rao Fires on Revanth Reddy
Harish Rao

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 4:39 PM IST

Harish Rao Fires on Revanth Reddy : రేవంత్‌రెడ్డి రైతులను అవమానిస్తున్నారని.. రైతుబంధు సొమ్మును భిక్షం అంటున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. మంత్రి హరీశ్​రావు(Harish Rao) సమక్షంలో ఇవాళ బీజేపీ నేత రాములు బీఆర్ఎస్(BRS)​లో చేరారు. ఆయనను మంత్రి హరీశ్​రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాములుకి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేయాలని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై తివ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని రేవంత్‌(Revanth Reddy) అంటున్నారని మండిపడ్డారు.

Harish Rao Comments on Telangana Congress : రేవంత్​రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని.. సీఎం కేసీఆర్‌(CM KCR) రాష్ట్రంలో రైతును రాజు చేశారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనలో భూముల విలువ పెరిగిందని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారని.. అక్కడ 2 గంటలు కూడా కరెంటు ఇవ్వట్లేదని కుమారస్వామి(Kumara Swamy) చెప్పారన్నారు. రేవంత్‌రెడ్డికి కనీసం హార్స్‌పవర్‌ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులను రేవంత్‌ అడ్డా కూలీలతో పోలుస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని మంత్రి హరీశ్​రావు తెలిపారు.

సమైక్యవాది పవన్‌ కల్యాణ్‌తో ఈటల రాజేందర్‌ ఎలా కలుస్తారు : మంత్రి హరీశ్​రావు

'రేవంత్‌రెడ్డి రైతులను అవమానిస్తున్నారు. రైతుబంధు సొమ్మును భిక్షం అంటూ అవమానించారు. రేవంత్‌రెడ్డికి రైతులంటే గౌరవం లేదు. రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌కు పోలిక ఉందా?. రైతులకు మూడు గంటల కరెంటు చాలని రేవంత్‌ అంటున్నారు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదు. కేసీఆర్‌ రైతును రాజు చేశారు. కేసీఆర్‌ పాలనలో భూముల విలువ పెరిగింది. కర్ణాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. కర్ణాటకలో 2 గంటలు కూడా కరెంటు ఇవ్వట్లేదని కుమారస్వామి చెప్పారు. రేవంత్‌రెడ్డికి కనీసం హార్స్‌పవర్‌ అంటే తెలుసా?. ఉస్మానియా విద్యార్థులను రేవంత్‌ అడ్డా కూలీలతో పోలుస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది.' -హరీశ్​రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి

Harish Rao Election Campaign in Telangana : మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో మునిగిపోయాయి. ఈ మేరకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం జోరుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో ముందంజంలో ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలానే మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు ప్రచారంలో పలు జిల్లాలో తిరుగుతున్నారు.

'రేవంత్‌రెడ్డికి రైతులంటే గౌరవం లేదు, వ్యవసాయంపై అవగాహన లేదు'

వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది : హరీశ్​రావు

గులాబీ గూటికి పాల్వాయి స్రవంతి- మునుగోడులో రాజగోపాల రెడ్డికి బుద్ధి చెప్పాలన్న కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details