Harish Rao fire on some Bankers: రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిలకు జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల ఖాతాలకు రావడం లేదన్న ఈనాడు కథనంపై మంత్రి స్పందించారు. ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని ఆయన ఆదేశించారు.
"రైతుబంధు నిధులను బకాయిలకు జమ చేస్తే ఊరుకోను" - Minister Harish Rao Latest speech
Harish Rao fire on some Bankers: ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పదో విడత డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేసింది. అయితే ఆ నగదును కొందరు బ్యాంకర్లు రైతుల బకాయిల కింద జమ చేసుకొంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఈనాడులో కథనం ప్రచురించారు. దానిపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు.

రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితిలోనూ బకాయిలకు జమ చేయరాదు
రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు జమ చేసుకోరాదని మంత్రి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ నిబంధనలను బ్యాంకర్లు అందరూ విధిగా పాటించాలని పేర్కొన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 7, 2023, 12:29 PM IST