Harish Rao Comments on Karnataka Congress Government : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజలు చేసిన తప్పునకు.. ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఆరు నెలల క్రితం కన్నడ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడేమో నరకం చూపిస్తున్నారని విమర్శించారు. ఆ రాష్ట్రంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ .. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కూడా వెళ్లలేదని వ్యాఖ్యానించారు. దిల్లీ నేతల హామీలను నమ్ముకుంటే మోసపోతారని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
బూతులు మాట్లాడే ప్రతిపక్షాలకు పోలింగ్ బూత్‌లో ప్రజలు బుద్ధి చెబుతారు : హరీశ్ రావు
Harish Rao Comments Congress Leader Chidambaram: కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఇవ్వలేదని హరీశ్ రావు అన్నారు. కర్ణాటకలో ఉన్న పథకాలకే కోత పెడుతున్నారని.. అక్కడ రోడ్లు వేయడానికే డబ్బులు లేవని డీకే శివకుమార్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని(Harish Rao Comments on Karnataka Government) వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్ రావు తెలిపారు. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. గుండెపోటు గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నది చేసేలా కాంగ్రెస్ నాయకుడు చిదంబరం మాట్లడారని మండిపడ్డారు. చిదంబరం చెప్పిన సారీ.. అణుబాంబు వేసిన అమెరికా.. జపాన్‌కు సారీ చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.