తెలంగాణ

telangana

ETV Bharat / state

1008 మంది మహిళలతో అభిషేకం - ఏపీ వార్తలు

Haridrabhishekam: వెయ్యి ఎనిమిది మంది మహిళలు అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వీరు.. గోదావరి జలాలతో శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారి మూలవిరాట్‌కు స్వయంగా అభిషేకం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్​లోని అనపర్తి పట్టణంలో వీధులు మహిళలతో కోలాహలంగా మారాయి.

Abhishekam with 1008 women
1008 మంది మహిళలతో అభిషేకం

By

Published : Jan 6, 2023, 5:46 PM IST

Haridrabhishekam: ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వెయ్యి ఎనిమిది మంది మహిళలు.. గోదావరి జలాలతో స్వయంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. అంతకుముందు అమ్మవారి చిత్రపటంతో మహిళలు పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు. ఊరేగింపునకు భారీగా తరలి వచ్చిన మహిళలతో పట్టణ వీధులు కోలాహలంగా మారాయి. సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న వీరుళ్లమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలకు ఆలయ కమిటీ సభ్యులు తాంబూళం, ప్రసాదం అందజేశారు.

1008 మంది మహిళలతో శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారి హరిద్రాభిషేకం

ABOUT THE AUTHOR

...view details