తెలంగాణ

telangana

ETV Bharat / state

వరకట్నం కోసం వేధింపులు.. గర్భవతి ఆత్మహత్య - గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో గర్భవతి ఆత్మహత్య

అదనపు వరకట్నం వేధింపులు తాళలేక గర్భంతో ఉన్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Harassment for dowry
వరకట్నం కోసం వేధింపులు

By

Published : Dec 19, 2019, 8:42 PM IST

వరకట్నం కోసం వేధింపులు
హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్​పేట్ దత్తాత్రేయ కాలనీలో వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మే నెలలో దగ్గరి బంధువైన శివకుమార్​తో సౌమ్యకు వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అత్తింటి వారు అదనపు కట్నం కోసం సౌమ్యను హింసిస్తున్నారని... గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా.. వేధింపులు తగ్గలేదని సౌమ్య తల్లిదండ్రులు వాపోయారు.

అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ కాగా.. 20 రోజుల క్రితం అత్తింటి నుంచి సౌమ్య బయటకు వెళ్లిపోయింది. తల్లి ఆమెను సముదాయించి పుట్టింటికి తీసుకొచ్చింది. మానసికంగా కుంగిపోయిన సౌమ్య ఈరోజు ఉదయం అఘాయిత్యానికి పాల్పడింది. సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌమ్య నాలుగు నెలల గర్భవతిగా డాక్టర్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details