తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయి' - human rights leader

పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని  పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు.  అడవుల నుంచి ఆదివాసీలను జులై 27 లోపు వెళ్లగొట్టాలని వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు.

'ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయి'

By

Published : Jun 10, 2019, 10:21 PM IST

అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై పౌరహక్కుల నేత ప్రొఫెసర్​ హరగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో 83 వేల మందితో పాటు 19 రాష్ట్రాల్లోని 20 లక్షల మందికి పైగా ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుకు నిరసనగా ధర్నాకు పిలుపునిస్తే నగరానికి వచ్చిన ఆదివాసీలను అరెస్ట్ చెయ్యడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పొడుభూములు పరిరక్షిస్తామని చేసిన వాగ్దానం మరచిపోయిందని విమర్శించారు. ఆదివాసీలు, గిరిజనుల కోసం పోరాడుతున్న సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసి నాయకులపై నిర్బంధం విధించడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

'ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయి'
ఇదీ చదవండి: రవిప్రకాశ్​ కేసులో రేపు మళ్లీ హైకోర్టులో వాదనలు

ABOUT THE AUTHOR

...view details