ఎనిమిదేళ్ల క్రితం హ్యాపీ డాగ్స్ పేరిట గచ్చిబౌలిలోని ఖానాపూర్‌లో శునకాల వసతి గృహాన్ని ప్రారంభించాడు ఆనంద్. 15 శునకాలతో మొదలైన ఈ వసతిగృహంలో ఇప్పుడు 130కి పైగా వివిధ రకాల శునకాలున్నాయి. వాటికి రకరకాల శిక్షణలు ఇస్తుంటారు. ఇవి సినిమాల్లోనూ నటించాయి. మరికొద్ది రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా 2 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి స్థాయి ఏసీ బ్రాంచ్‌ను ప్రారంభించబోతున్నాడు. జంతు ప్రేమికులకు ఆసక్తి రేపుతున్న హ్యాపీ డాగ్స్ నిర్వాహకుడు ఆనంద్‌తో ఈటీవి భారత్ ముఖాముఖి.
గచ్చిబౌలిలో ఉంది.. కుక్కలకూ ఓ వసతి గృహం - Dog Hostels
అతడు కొన్నేళ్లు బ్యాంకు ఉద్యోగం చేశాడు. సంతృప్తినివ్వలేదు. జంతువులంటే అమితమైన ఇష్టం. బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నాడు. మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
dogs hostel
Last Updated : Aug 22, 2019, 12:56 PM IST