తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు భాగ్యనగరంలో హనుమాన్ విజయయాత్ర .. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Hanuman Shobha yatra in Hyderabad Today: హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని జంటనగరాల్లో నిర్వహించే విజయయాత్రకు సర్వం సిద్దమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభయ్యే యాత్ర సికింద్రాబాద్‌ తాడ్‌బన్‌ హనుమాన్‌ దేవాలయం వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. సీసీ కెమారాలతో పాటు డ్రోన్ల ద్వారా విజయయాత్ర కొనసాగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయనున్నారు.

By

Published : Apr 6, 2023, 8:52 AM IST

hanuman shoba yatra arrangements in hyderabad telangana
హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధం.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు భాగ్యనగరంలో హనుమాన్ విజయయాత్ర .. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Hanuman Shobha yatra in Hyderabad Today: హనుమాన్​ జయంతి నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగే విజయయాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1500 లకు పైగా పోలీసులతో యాత్ర కొనసాగే మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 11.30 గంటల సమయంలో గౌలిగూడ రామమందిరం నుంచి విజయాత్ర ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ తాడ్‌బన్‌ హనుమాన్‌ దేవాలయం వద్ద ముగియనుంది.

Hanuman procession in Hyderabad today : ఊరేగింపు కొనసాగే గౌలిగూడ, పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, కవాడీగూడ, బైబిల్‌ హౌస్‌, రాంగోపాల్‌పేట్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల మీదగా తాడ్‌బన్‌ హనుమాన్‌ దేవాలయం వరకు దాదాపు 12 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్‌లు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మూసివేయనున్నారు.


"సౌత్ వన్ వైపు వెళ్లేవారు కూడా ఈ రూట్ ఎలా తీసుకోవాలంటే వయా కోటి, బ్యాంక్ స్ట్రీట్, ఛాదర్ ఘాట్, బషీర్​బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్​పుర,ఫీవర్ హాస్పిటల్, చే నంబర్, అలీకే, ముసరాంబాగ్, దిల్​సుఖ్​నగర్ ఇవి మేము సూచించిన యాత్ర మార్గం. ఉదయం9 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల మధ్యలో ఇక్కడ తీసుకోవచ్చు. మీకు ఎక్కడైనా ట్రాఫిక్​లో ప్రాబ్లం ఉన్నా, చాలా అవసరం ఉంటే ఈ సమస్యను అర్థం చేసుకుని మాతో ఇంటరాక్ట్ కండి. ఖచ్చితంగా మీకున్న ఇబ్బందిని తొలగించడానికి ట్రాఫిక్ పరంగా మేము చెప్తాము."- సుధీర్‌బాబు, ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు:హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఆయన వివరించారు. విజయ యాత్రకు 750 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు.

వాహనదారులకు సమస్యలు ఎదురైతే సామాజిక మాధ్యమాల ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 9010203626 ద్వారా, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం 040 27852482 ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని సుధీర్‌బాబు తెలిపారు. twitter.com/HYDTP, fa-cebook.com/HYDTP ద్వారా కూడా వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్‌ అదనపు సీపీ తెలిపారు. వాహనదారులు, భక్తులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details