హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని స్వర్ణ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఈ సారి వేడుకలను అంతర్గతంగా జరిపారు.
నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు - హైదరాబాద్ స్వర్ణ దేవాలయం
రాష్ట్రంలో కరోనా విజృంభణ, లాక్డౌన్ వల్ల హనుమాన్ జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని స్వర్ణ దేవాలయంలో కొంతమంది సమక్షంలోనే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.
![నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు hanuman jayanthi vedukalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:27:45:1622815065-tg-hyd-75-04-hanuman-jayanthi-at-hare-krishna-av-ts10009-04062021192233-0406f-1622814753-871.jpeg)
hanuman jayanthi vedukalu
ఆలయ అర్చకులు ఆంజనేయుడి విగ్రహాన్ని అందంగా అలంకరించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:KCR: పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదు