Handloom Section of All India Padmashali Society Meeting in Hyderabad : గత సంవత్సరన్నర కాలంగా అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం రోజున ఉదయం 8 గంటలకు ఎర్రకోట నుంచి రాజ్‌ఘాట్ వరకు హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో చేనేత డిక్లరేషన్‌పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌కు వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, దేశవ్యాప్తంగా చేనేత ప్రతినిధులు హాజరుకానున్నారు.
President of Handloom Section of All India Padmasali Association : తెలంగాణ భవన్లో చేనేత నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేసిన ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న హెచ్చరించారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించిన చేనేతలను విస్మరిస్తే పార్టీలకు భవిష్యత్ ఉండదని అఖిల భారత పద్మశాలి యువజన సంఘం జాతీయ ఇంఛార్జీ అవ్వారి భాస్కర్ అన్నారు. బతుకు భారంగా జీవిస్తున్న చేనేత కళాకారులపై పన్నుల భారం మోపడం సరికాదని పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు స్వర్గం రవి అన్నారు. కేంద్రం స్పందించకుంటే తెలంగాణ ప్రాంతం నుంచి మరో ఉద్యమం ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో స్వర్గం నర్సయ్య, చందుపట్ల పరంధాములు, విడపు రాజు, వేముల చంద్రశేఖర్, మంద రమేష్ , తావుటుమురళి, ఆయిల శంకర్, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
KTR: 'హైదరాబాద్‌లో చేనేత మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి'