తన భార్య అవినీతి ఆరోపణలతో అరెస్టైన కేసులో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న షేక్‌పేట తహసీల్దారు భర్త అజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. అజయ్ కుమార్ మృతదేహాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్త మృతితో సుజాత మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు.
సుజాతకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శ - హైదరాబాద్ నేర వార్తలు
షేక్‌పేట తహసీల్దారు సుజాత భర్త అజయ్ కుమార్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇవాళ అంబర్ పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుజాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్‌కు వెళ్లడం వల్ల మనోవేదనకు గురైన అజయ్ కుమార్ భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికి చేరుకున్న సుజాత భర్త మృతదేహం
అవినీతి ఆరోపణలపై తన భార్య అరెస్ట్ అయినప్పటి నుంచి ఒత్తిడిలో ఉన్న అజయ్ కుమార్ వారంరోజులుగా చిక్కడపల్లిలోని తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం సుజాత బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. తీవ్ర ఒత్తిడికి గురైన అజయ్ కుమార్ బుధవారం ఉదయం 7 గంటల సమయంలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.