తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ప్రగతి భవన్​లో హ్యాండ్ వాష్ - coronavirus safety

వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్​లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రగతి భవన్​లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు.

hand wash at pragathi bhavan in hyderabad
ప్రగతి భవన్​లో హ్యాండ్ వాషింగ్

By

Published : Mar 24, 2020, 10:21 PM IST

కరోనా వ్యాపిస్తున్న వేళ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత గుర్తు చేస్తూ ప్రగతి భవన్​లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రగతి భవన్​లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు. మంత్రులు, సీనియర్ అధికారులు చేతులు కడుక్కుని, శానిటైజర్​తో శుభ్ర పరుచుకుని లోపలికి రావాలని నిబంధన పెట్టారు.

చేతులు కడుగుతున్న ఈటల రాజేందర్​
మంత్రి నిరంజన్​ రెడ్డి

నేటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

సీఎస్​ సోమేశ్​ కుమార్​
హీరో నితన్​, డీజీపీ మహేందర్​ రెడ్డి

ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ABOUT THE AUTHOR

...view details