హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టాన్లీ మహిళా డిగ్రీ కళాశాల ముందు విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాజరు, ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధిస్తోందంటూ విద్యార్థినులు,వారి తల్లిదండ్రులు కళాశాల గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. హాల్ టిక్కెట్లు ఇచ్చేంత వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని విద్యార్థినులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థినులకు హాల్ టికెట్లు ఇప్పించి...ఆందోళనను విరమింపజేశారు.
'పోలీసుల సహకారంతో విద్యార్థినులకు హాల్ టికెట్లు' - COLLEGE MANAGEMENT
వారంతా హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ డిగ్రీ కళాశాల విద్యార్థినులు...పరీక్షల సందర్భంగా కళాశాల యాజమాన్యం వివిధ కారణాలను సాకుగా చూపి తమను వేధిస్తోందని ఆందోళన బాట పట్టారు. స్థానిక పోలీసుల సాయంతో హాల్ టికెట్లు అందుకున్నారు.
యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది : విద్యార్థినులు
ఇవీ చూడండి : చావులోనూ వీడని 'ప్రేమ' బంధం