Half Kilo Gold Chori Case in Hyderabad: ఇంటి యాజమానులు, సభ్యులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందనేందుకు ఈకింది ఘటనే ఓ ఉదాహరణ. ఓ ఇంటి యాజమాని తన ఇంటి బీరువాలో బంగారాన్ని దాచుకున్నాడు. అయితే ఆ బీరువా కీ కనిపించలేదని డూప్లికేట్ తాళం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అక్కడే తాను తప్పటడుగు వేశాడు.
తాళం చెవి చేసే వ్యక్తులను తమ ఇంటికి ఆహ్వానించి బీరువా డూప్లికేట్ కీ(Duplicate Key) చేయమని చెప్పాడు. వారు కీ చేసేందుకు ప్రయత్నించి చివరికి చేయలేమని చెప్పి వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన ఇంటి యజమానికి కొన్ని రోజులకు మరో వ్యక్తితో బీరువా తెరిపించాడు. సీన్ కట్ చేస్తే అందులో ఉండాల్సిన బంగారం కనిపించలేదు. వెంటనే లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
ఆలయాల్లో హుండీ చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
Gold Theft Complaint Madhuranagar Police Station: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని మధురానగర్‌లో కల్యాణ్‌నగర్ ఫేజ్-1 ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ రాజు (75) ఇంట్లో శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్లో భద్రపర్చిన సుమారు 488 గ్రాముల బంగారు ఆభరణాలను నవంబర్ నెలలో తీసుకొచ్చారు. శుభకార్యం అయిపోయాక వాటిని చిన్నపాటి చెక్కపెట్టెలో పెట్టి అల్మారాలో భద్రపర్చారు. తిరిగి బ్యాంకు లాకర్లో పెడదామని తాళాలు వెతకగా కనిపించలేదు. అనంతరం వేరే కీ చేసేందుకు మధరానగర్లో కనిపించిన 55, 35 వయస్సు ఉన్న ఇద్దరి వ్యక్తులను ఇంటికి తీసుకువచ్చాడు.