భానుడి భగభగలు అధికమవుతున్నందున... రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు
వేసవి తీవ్రత పెరుగుతున్నందున.. ఈనెల 16 నుంచి ఒక్కపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
schools
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు బడులు నడపాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పన్నెండున్నర గంటలకు మధ్య మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు మొదలవుతాయని... జూన్ 12న తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని చిత్రా రామచంద్రన్ తెలిపారు.
Last Updated : Mar 10, 2020, 9:45 PM IST