తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి ఉపాధ్యాయులకు ఒంటిపూట విధులు - విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులు నేటి నుంచి ఒకటే పూట విధులు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని విద్యాశాఖ సంచాలకురాలు పేర్కొన్నారు.

half day duties for teachers, telangana news today
నేటి నుంచి ఉపాధ్యాయులకు ఒంటిపూట విధులు

By

Published : Apr 7, 2021, 8:35 AM IST

రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం నుంచి ఒంటిపూట పనిచేస్తే చాలు. ఈ మేరకు పాఠశాలల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సమావేశమై విన్నవించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు ఒంటి పూట(ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) పనిచేస్తాయని అందులో పేర్కొన్నారు. గత నెల 24 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసేయగా.. ఉపాధ్యాయులు యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో వారి వినతి మేరకు ఒంటిపూట పనిచేసేలా ఆదేశాలిచ్చారు. తొలుత ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నా.. తర్వాత వాటికి వర్తించవని సవరణ ఉత్తర్వులను అధికారులు జారీ చేశారు.

ఇదీ చూడండి:9, 10 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details