తెలంగాణ

telangana

ETV Bharat / state

హజ్​యాత్ర రద్దు కాలేదు: మసిఉల్లాఖాన్ - హజ్​యాత్ర రద్దు కాలేదు

హజ్ యాత్ర రద్దు అయినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

haj committee chairman masiullakhan on haj tour
హజ్​యాత్ర రద్దు కాలేదు: మసిఉల్లాఖాన్

By

Published : Mar 25, 2020, 5:41 PM IST

రాష్ట్ర హజ్​ కమిటీ ఛైర్మన్​ మసిఉల్లాఖాన్ హజ్​ యాత్రపై స్పందించారు. యాత్ర రద్దు అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. హజ్ యాత్రకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడలేదని తెలిపారు. సౌదీ నుంచి కూడా యాత్రకు సంబంధించి ఎలాంటి సూచనలు రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి హజ్ యాత్రికులకు ఇచ్చే శిక్షణను వాయిదా వేశామని వెల్లడించారు. యాత్ర యథావిధిగా కొనసాగుతుందనే నమ్మకం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details