తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమాజ హితం కోసం ప్రార్థించండి' - cp

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్​యాత్ర కోసం శంషాబాద్ విమానశ్రయానికి వెళ్లే బస్సును హైదరాబాద్ నాంపల్లిలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు.

'సమాజ హితం కోసం ప్రార్థించండి'

By

Published : Aug 3, 2019, 2:22 PM IST

సమాజంలో మానవత్వమే గొప్పమతమని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని హజ్‌ కార్యాలయం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళే హజ్‌ యాత్రికుల బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మహ్మద్‌ ప్రవక్తను తమ కుటుంబసభ్యుల సంక్షేమంతో పాటు సమాజ హితాన్ని కోరుకోవాలని యాత్రికులను ఆయన కోరారు. శాంతిభద్రతలతో పాటు నేరాలు తగ్గే దిశగా అందరూ తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనలో ఉండే హజ్‌ యాత్రికులు సమాజ వృద్ధిలో కుడా భాగస్వామ్యులు కావాలని సూచించారు. నగరం శాంతి భద్రతల పరిరక్షణలో ముందంజలో ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, భారీ సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్నాయని సీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల హజ్‌ కమిటీ ఛైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

'సమాజ హితం కోసం ప్రార్థించండి'

ABOUT THE AUTHOR

...view details