హైదరాబాద్ హబ్సిగూడలోని వివేకవర్థిని ఉన్నత పాఠశాల 1980-81 విద్యార్థులు తమ గురువులను ఘనంగా సత్కరించారు. గురువులు నేర్పిన విద్యాబుద్దుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులను సత్కరించి సన్మానించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది పూర్వ విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయలు ఆనందం వ్యక్తం చేశారు.
పూర్వ విద్యార్థుల గొప్ప సత్కారం - పూర్వ విద్యార్థులు
హైదరాబాద్లోని జాంబాగ్ వివేకవర్థిని ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
పూర్వ విద్యార్థుల గొప్ప సత్కారం