తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేటి బాలికల ఆరోగ్యమే... రేపటి తల్లుల భవిష్యత్తు' - ప్రముఖ గైనకాలిజిస్ట్ డాక్టర్ సరోజిని

ఎదిగే ఆడపిల్లలకు, మహిళలకు వ్యక్తిగత శుభ్రతపై, శారీరక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గైనకాలిజిస్ట్ డాక్టర్ సరోజిని అన్నారు.

SWACHH BETI MISSION
'నేటి బాలికల ఆరోగ్యమే... రేపటి తల్లుల భవిష్యత్తు'

By

Published : Feb 28, 2020, 4:44 PM IST

రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భేటీ మిషన్ పేరిట ఎదిగే ఆడపిల్లలకు సానిటరీ న్యాప్ కిన్స్ వాడకంపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రముఖ గైనకాలజిస్ట్, డాకర్ట్ సరోజని తెలిపారు. అలాగే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 8 వేల మంది బాలికలు, మహిళలకు శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించామని తెలిపారు.

ప్రతి మహిళకు జరిగే నెలసరి రుతుక్రమం సమయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో మహిళలకు ఏలాంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చని తెలిపారు. సానటరీ ప్యాడ్లను విద్యార్థులు స్కూల్ బ్యాగుల్లో పెట్టి తీసుకెళ్లడానికి వీలుగా డా. సరోజిని సుమారు 3 వేల స్వచ్ఛ భేటీ బ్యాగులను తానే స్వయంగా కుట్టి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. వీటిపై మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. బాలికలు ఆరోగ్యంగా ఉంటే రేపటి తల్లులు ఆరోగ్యంగా ఉంటారని ఆమె అన్నారు.

'నేటి బాలికల ఆరోగ్యమే... రేపటి తల్లుల భవిష్యత్తు'

ఇవీ చూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details