తెలంగాణ

telangana

ETV Bharat / state

Gym Trainer Sexually Assaults Young Woman : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి - జిమ్​కు వెళ్లిన యువతిపై లైంగిక దాడి

Gym Trainer Sexually Assaults Woman in Film Nagar : సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిపోతుండటం వల్ల యువత ఈజీగా ప్రేమ వలలో పడుతున్నారు. ప్రేమిస్తున్నాను అని అబ్బాయిలు చెప్పగానే అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా వారి మాయలో పడి చివరకు మోసపోయామని బాధపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో కూడా చోటుచేసుకుంది. రోజూ జిమ్​కు వెళ్లే ఓ యువతి.. ట్రైనర్ ప్రేమిస్తున్నానని చెప్పగానే అతణ్ని నమ్మేసింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరైన తర్వాత.. ఇప్పుడు మాట మార్చేశాడు ఆ ట్రైనర్. పెళ్లి చేసుకోమని అడిగితే.. ముఖం చాటేసి తిరుగుతున్నాడు.

Gym Trainer Sexually Assaults Young Woman
Gym Trainer Sexually Assaults Young Woman

By

Published : Jun 16, 2023, 1:25 PM IST

Gym Trainer Sexually Assaults Woman in Hyderabad : రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలు కట్టడి చేయడానికి షీ టీమ్ ఉన్నాగానీ.. నేరాలుపెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హత్యలు, అత్యాచారాలు అరికట్టడానికి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్న ఈరోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. కన్నతండ్రి నుంచి కట్టుకున్న భర్త వరకు ఎవరు ఎంతటి దుర్మార్గానికి పాల్పడతారో ఊహించలేకపోతున్నాం. నాలుగు మంచి మాటలు చెప్పగానే అవతలి వ్యక్తులను గుడ్డిగా నమ్మేసి.. తర్వాత అసలు రంగు బయటపడగానే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

Gym Trainer Sexually Assaults Woman in Film Nagar : కొంత మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలకు దగ్గరవుతు.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి.. అవసరం తీరగానే ముఖం చాటేస్తుంటారు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకుపాల్పడుతున్నారు. ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అనగానే గుడ్డిగా నమ్మి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ కొందరు యువతులు వారి జీవితంలో చోటుచేసుకున్న ఘటనలు మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారి జీవితంతో ఆడుకున్న వారికి తగిన గుణపాఠం చెబుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది హైదరాబాద్​లో.

వ్యాయామం చేయడానికి జిమ్​కు వెళ్లిన ఓ యువతికి అక్కడి ట్రైనర్​తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తనను ప్రేమిస్తున్నా అని ఆ ట్రైనర్ చెప్పగానే ఆ అమ్మాయి నమ్మేసింది. తీరా అవసరం తీరాక.. ఇప్పుడు పెళ్లి చేసుకోనని ముఖం చాటేస్తున్నాడు. అతడి మోసం గ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్​లోని ఫిలిం నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జిమ్​కు వెళ్లిన ఒక యువతిపై అక్కడి జిమ్​ ట్రైనర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. టోలిచౌకిలో గత కొన్నేళ్లుగా ఆసిన్ (25) అనే ట్రైనర్ జిమ్​ను నడిపిస్తున్నాడు. ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి తన జిమ్​లో జాయిన్​ అయింది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఆసీమ్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి ప్రేమ నిజమే అని నమ్మిన ఆ యువతిపై అదను చూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను మోసం చేశాడని గ్రహించిన యువతి.. పెళ్లి చేసుకోమని కోరగా.. ముఖం చాటేశాడు. ఆ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆసిన్​పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ 376, 417,420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details