Shirdi Temple Is Decarate For Gurupurnima Celebrations : ఈ ఏడాది జులై 2 నుంచి జులై 4వ తేదీ వరకు జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు షిర్డీ ముస్తాబు అవుతోంది. షిర్డీ సాయిబాబా సంస్థాన్ తరఫున ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివ శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి.. ఆయన సమావేశం నిర్వహించారు.
సాయిబాబాపై విశ్వాసం ఉన్న అసంఖ్యాక భక్తులు.. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజు సాయినాధుని సమాధి దర్శనం కోసం వస్తారని ఆయన తెలిపారు. అలాగే గురుపూర్ణిమ ఉత్సవాల్లో కూడా పాల్గొంటారన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గురుపూర్ణిమ ఉత్సవాలకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆ మూడు రోజులు ముఖ్య కార్యక్రమాలు నిర్వహణ : ఉత్సవాల్లో మొదటి రోజైన జులై 2న ఉదయం 05.15 గంటలకు శ్రీచి కాకడ హారతిని షిర్డీ సాయికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 05.45 గంటలకు మంగళస్నానం చేయించి.. అనంతరం 07.00 గంటలకు సాయిబాబా దర్శనం, పద్యపూజ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు, సాయంత్రం 4, 6 గంటలకు ఒక్కొక్కసారి హారతి ఇవ్వనున్నారు. దీని తర్వాత సాయి కీర్తన కార్యక్రమం, శ్రేంచి ధూపరతి ఇచ్చి.. రాత్రికి మళ్లీ భజన కార్యక్రమం ఉందనుంది. రాత్రి 09.15 గంటలకు ఆ గ్రామంలో శ్రీపల్లకి ఊరేగింపు.. ఆ ఊరేగింపు తిరిగి శ్రీంచికి చేరుకోవడం జరగనుంది. ఆ రోజు మొత్తం సాయినాధుని పారాయణం చదవనున్నారు.