ప్రతిభావంతులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చేయడానికి గురుకులాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. ఇంటర్‌తో సమాంతరంగా జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ-సీపీటీ శిక్షణ అందిస్తారు. విద్యార్థుల దినచర్య ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటలకు ముగుస్తుంది. చదువుతోపాటు ఆటపాటలకూ ప్రాధాన్యముంటుంది. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.
ఏఏ గ్రూపులు ఉన్నాయి?
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. చదువుతోపాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. ట్యూషన్ ఫీజు ఉండదు. విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి లోకో పేరెంట్ విధానం ఉంటుంది. అంటే ప్రతి 15-20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మెంటర్‌గా వ్యవహరిస్తారు. చదువులో వెనుకబడిన వారిని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతారు. మెరిట్ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం మరింత మెరుగైన తర్ఫీదునిస్తారు. ఈ రెండు కారణాల వల్లే గురుకులాల్లో దాదాపు 96 శాతం ఇంటర్ ఉత్తీర్ణత నమోదవుతోంది. ఈ సంస్థల్లో చదువుకున్నవారు ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు. జేఈఈ, నీట్, ఎంసెట్‌ల్లో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
ఎవరు అర్హులు?
2020లో పదో తరగతి పరీక్షలు మొదటి ప్రయత్నంలో రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారు అనర్హులు. సొంత రాష్ట్రంలో చదువుతున్నవారు మాత్రమే అర్హులు. జనరల్ విద్యార్థులు 6 జీపీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 5 జీపీఏ సాధించాలి. ఇంగ్లిష్‌లో జీపీఏ 4 తప్పనిసరిగా ఉండాలి.
పరీక్ష విధానం
గురుకులాల్లో ఎంపీసీ గ్రూపు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. బైపీసీ వారికి ఇంగ్లిష్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. సీఈసీ, ఎంఈసీ గ్రూపు కోరుకున్నవారికి ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఏపీలో ఈఈటీ, సీజీటీ ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఈఈటీకి ఎంపీసీకి నిర్వహించే పరీక్ష, సీజీటీకి బైపీసీకి పెట్టే పరీక్ష రాయాలి.
ఏపీ, టీఎస్ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షల వ్యవధి రెండున్నర గంటలే. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతి సబ్జెక్టుకూ 50 మార్కులను కేటాయించారు. ఆ సబ్జెక్టుల్లో సంబంధిత (ఏపీ లేదా తెలంగాణ) రాష్ట్రానికి చెందిన పదో తరగతి సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ విభాగంలో జనరల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఏ గ్రూపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంగ్లిష్ తప్పనిసరి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహిస్తారు.
సన్నద్ధత ఎలా?
ఇంగ్లిష్: ఈ విభాగంలో పాఠ్యపుస్తకాల నుంచి ఎలాంటి ప్రశ్నలూ అడగరు. అభ్యర్థి ఆంగ్లభాషపై ఎంతవరకు పట్టు సాధించారో తెలుసుకుంటారు. ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఇందులో భాగంగా ఇచ్చిన పదానికి అర్థం గుర్తించమనడం, వాక్యాన్ని ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలోకి మార్చమనడం, ఖాళీని పూరించడం, రెండు వాక్యాలను కలిపి రాయడం, ఉన్నవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించడం, వాక్యానికి అర్థాన్ని కనిపెట్టడం, సరైన పదాన్ని గుర్తించడం, ప్యాసేజీ ప్రశ్నలు... మొదలైనవి ఉంటాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కుల కోసం వ్యాకరణంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. లెటర్ రైటింగ్ తెలుసుకోవాలి. భాషా భాగాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి, వాటి ప్రకారం సన్నద్ధమవ్వాలి.
భౌతిక రసాయన శాస్త్రాలు: పదోతరగతిలోని అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని అంశాలనూ సమ ప్రాధాన్యంతో చదవాలి. ముఖ్యమైన కాన్సెప్టులను నోట్స్‌గా రాసుకోవాలి. అనువర్తన, పరిశీలనాత్మక ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రయోగాంశాలు, సమస్యలపైనా ప్రశ్నలు వస్తున్నాయి. సూత్రాలను గుర్తుంచుకుని, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.
గణిత శాస్త్రం: వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. అధ్యాయాల వారీ అధ్యయనం సాగించాలి. ముఖ్యమైన సూత్రాలను రాసుకోవాలి. ఇచ్చిన ప్రశ్నకు ఏ సూత్రం అనువర్తించాలో తెలుసుకోవాలి. ఇందుకు ముందస్తు సాధన కీలకం. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. తక్కువ వ్యవధిలో సమాధానాలు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన తప్పనిసరి.
జీవశాస్త్రం: ఈ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలన్నీ నేరుగానే అడుగుతున్నారు. ప్రాథమికాంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల వాటిని శ్రద్ధతో చదివి, మననం చేసుకుంటే జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. పటాలకు సంబంధించిన ప్రశ్నలకూ అవకాశం ఉంది.
సాంఘిక శాస్త్రం: పాఠ్యపుస్తకంలోని అన్ని విభాగాలకూ పరీక్షలో సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పుస్తకం మొత్తం క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి. కంఠస్థం చేయకుండా ప్రతి పాఠ్యాంశాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి. ప్రతి వాక్యాన్నీ ప్రశ్నరూపంలోకి అన్వయించుకుని చదివితే అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
తెలంగాణలో...
ఆన్‌లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 15, 2020 వరకు స్వీకరిస్తారు
పరీక్ష తేదీ: మే 10, 2020
వెబ్‌సైట్: https://tsrjdc.cgg.gov.in
ఆంధ్రప్రదేశ్‌లో...