తెలంగాణ

telangana

ETV Bharat / state

Gurukula Teachers Recruitment Exams Date : ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలు - Telangana latest news

tswreis
tswreis

By

Published : Jun 15, 2023, 9:04 PM IST

Updated : Jun 15, 2023, 10:44 PM IST

20:57 June 15

ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలు

Gurukula Teachers Recruitment Exams in Telangana : గురుకుల నియామక పరీక్షలు ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. 1వ తేదీ నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల నియామక సంస్థ ప్రకటించింది. పరీక్షల వారీగా షెడ్యూలును రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. గురుకులాల్లో 9 వేల 231 ఉద్యోగాల కోసం 2 లక్షల 63 వేల 45 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో బోధన, బోధనేతర పోస్టులకు ఏప్రిల్ 6న తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేశారు.

డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జూనియర్ కాలేజీల్లో 2 వేల 8 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. పాఠశాలల్లో 1276 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4 వేల 20 టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు.

అక్టోబర్ లేదా నవంబర్​లో గ్రూప్​-1 ప్రధాన పరీక్ష.. రాష్ట్రంలో జూన్​ 11న జరిగిన గ్రూప్​-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పరీక్షకు మూడు నెలల సమయం ఇవ్వాలని యోచిస్తున్నారు. కాగా ప్రధాన పరీక్షను అక్టోబరు లేదా నవంబరు నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన మాస్టర్​ ప్రశ్నాపత్రాన్ని, ప్రాథమిక కీని త్వరలోనే అధికారిక వెబ్​సైట్లో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసి తుది కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. అనంతరం మూల్యాంకనం నిర్వహించి ఫలితాలు విడుదల చేయ్యాలని భావిస్తోంది.

Group3 Notification 2023 : ఇటీవలే తెలంగాణ తొలి గ్రూప్‌-3 పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 1365 పోస్టులకు గానూ 5,36,477 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు జనవరి 24 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా ఫిబ్రవరి 23 చివరి తేదీగా అధికారులు పేర్కొన్నారు. కానీ చివరి మూడు రోజుల్లో 90,147 మంది దరఖాస్తు చేశారు. చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే గ్రూప్‌-3 పరీక్ష తేదీలను ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఒక్కోపోస్టుకు సగటున 116 మంది : మరోవైపు గ్రూప్-4 పరీక్షకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య అధికం అవడం వలన పోటీ పడే నిష్పత్తి కూడా పెరిగింది. దీని వలన అభ్యర్థి ఉద్యోగం సంపాదించాలంటే తగిన కసరత్తు చేపట్టాలి. పోటీని దృష్టిలో పెట్టుకొని సన్నద్దం కావాలి. రాష్ట్రంలో గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మొత్తం 8,180 పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈ సారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 15, 2023, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details