తెలంగాణ

telangana

ETV Bharat / state

150 మందికి నీట్​ ర్యాంకులు: ఆర్​ఎస్​ ప్రవీణ్​ హర్షం

సోషల్ , ట్రైబల్ వెల్​ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్స్​లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వారిలో సుమరు 150మంది నీట్ ర్యాంకులు సాధించారు. వీరందరికీ టీఎస్​డబ్లూఆర్ ఈఐఎస్ సెక్రటరీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

టీఎస్​డబ్లూఆర్​లో లాంగ్​టర్మ్ కోచింగ్@150

By

Published : Jun 7, 2019, 3:15 PM IST

గురుకుల పాఠశాలల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు నీట్ ర్యాంకులు రావటం పట్ల టీఎస్​డబ్లూఆర్ ఈఐఎస్ సెక్రటరీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్​డబ్ల్యూఆర్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నీట్​లో ర్యాంకులు సాధించిన వారికి ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. నీట్ 2019లో 150మంది ర్యాంకులు సాధించటం.. గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేస్తామని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

టీఎస్​డబ్లూఆర్​లో లాంగ్​టర్మ్ కోచింగ్@150

ABOUT THE AUTHOR

...view details