తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు' - hyderabad latest news

తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. ఆరంభ శూరత్వమే తప్ప ఆచరణ సాధ్యం కాని నోటిఫికేషన్లు ఇస్తూ.. వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు.

gurukula principle candidates protest at tspsc bhavan
'నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు'

By

Published : Jan 2, 2021, 1:38 PM IST

ఆరంభ శూరత్వమే తప్ప ఆచరణ సాధ్యం కాని నోటిఫికేషన్లు ఇస్తూ.. తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద గురుకుల ప్రిన్సిపల్ అభ్యర్థులు నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు.

టీఎస్​పీఎస్సీ ద్వారా గురుకుల పాఠశాలల్లో 304 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేన్​ జారీ చేశారని ఆయన తెలిపారు. 2018లో 1:2 నిష్పత్తిలో ఫలితాలను విడుదల చేసి 288 మంది అభ్యర్థులను ఎంపిక చేశారని గుర్తుచేశారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా వారంతా ఉద్యోగం కోసం ఎదురు చూసి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని... లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

ABOUT THE AUTHOR

...view details