రాష్ట్రంలో గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ని వెంటనే రద్దు చేయాలని గురుకుల డిగ్రీ గెస్ట్ మహిళా లెక్చెరర్లు ఆందోళనకు దిగారు. మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురు కులాల నియామక మండలి కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు.
అర్హత పరీక్షల ద్వారా ఎంపికై గత ఐదేళ్లుగా ప్రభుత్వ మార్గదర్శకంలో విధులు నిర్వహిస్తున్నామనీ, ఈ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నష్టపోతామని అధ్యాపకులు వాపోయారు.