తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్​ పెట్టుకోని ట్రాఫిక్​ సీఐకి ఎస్పీ జరిమానా

నిబంధనలు ఉల్లఘించిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తారు. అటువంటి పోలీసులే రూల్స్​ అతిక్రమిస్తే..? కరోనా ప్రబలుతున్న వేళ మాస్క్​ ధరించకుండా విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ట్రాఫిక్​ సీఐకి గుంటూరు అర్బన్​ ఎస్పీ జరిమానా విధించి.. మాస్క్​ అందించారు.

By

Published : Mar 30, 2021, 1:54 PM IST

Updated : Mar 30, 2021, 2:56 PM IST

ap police inspection on mask wear, ap police latest news
మాస్కు ధరించడంపై ఏపీ పోలీసులు తనిఖీలు, ఏపీ పోలీసులు తాజా వార్తలు

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు అర్బన్‌ పరిధిలోని లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

మాస్కు ధరించడంపై ఏపీ పోలీసులు తనిఖీలు, ఏపీ పోలీసులు తాజా వార్తలు

లాడ్జి కూడలిలో మాస్కు ధరించకుండా వెళ్తున్న తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావును ఆపి ఎస్పీ ప్రశ్నించారు. హడావుడిలో మాస్క్​ మర్చిపోయానని సీఐ సమాధానమివ్వగా.. ఆయనకు జరిమానా విధించి.. ఎస్పీ స్వయంగా మాస్కు తొడిగారు. కొవిడ్​ విజృంభిస్తున్న సమయంలో పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించని వాహనదారులను ఆపి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కోరారు.

ఇదీ చదవండి:'430 జిల్లాల్లో నెల రోజులుగా కరోనా కేసులు సున్నా'

Last Updated : Mar 30, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details