అరుదైన శస్త్ర చికిత్సల్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వైద్యులు మరోసారి సత్తా చాటారు. ప్రత్యర్థుల దాడిలో కాలు, చేయి తెగిన వ్యక్తికి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి వాటిని అతికించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి సాగర్ కాలువ వద్ద ఈ నెల 21న రాత్రి తెదేపా మద్దతుదారులు బి.కృష్ణయ్య, జి.వీరాస్వామిలపై అదే గ్రామానికి చెందిన కొందరు మారణాయుధాలతో దాడి చేశారు. ఘటనలో కృష్ణయ్య ఎడమ చేయి, కాలు పూర్తిగా తెగిపోయిన దశలో గుంటూరులోని లలితా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు ఆదివారం తీసుకువచ్చారు.
10 గంటలు శ్రమించి... తెగిన శరీర భాగాలను అతికించారు - గుంటూరులో అరుదైన ఆపరేషన్ వార్తలు
ప్రత్యర్థుల దాడిలో కాలు, చేయి తెగిన వ్యక్తికి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి వాటిని అతికించారు. 10 గంటలు శ్రమించి శస్త్రచికిత్సను ఏపీలోని గుంటూరు వైద్యులు విజయవంతం చేశారు.
10 గంటలు శ్రమించి... తెగిన శరీర భాగాలను అతికించారు
కార్డియో థొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఇమ్మిడిశెట్టి మారుతీప్రసాద్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పది గంటలపాటు శ్రమించి ఆయనకు చేతిని, కాలిని అతికించే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అవయవాలను తిరిగి అతికించిన ఘటనల్లో ఇది నాలుగోదని వైద్యుడు మారుతీప్రసాద్ చెప్పారు. తనతో పాటు ప్లాస్టిక్ సర్జన్ విశ్వనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. బాధితుడు కోలుకుంటున్నాడని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి : పార్థసారథి