గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడి వివిధ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ సబ్జెక్టులను బోధిస్తున్న అధ్యాపకులు, తెలుగు భగవద్గీత లాంటి అంశాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు 75 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలు పూర్తిగా వర్చువల్ విధానంలో జరిగాయి.
ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వెంకప్ప భాగవతుల వ్యవహరించగా.. సాంకేతిక సహకారాన్ని విక్రమ్ సుఖవాసి అందించారు. వివిధ దేశాల్లోని ఉపాధ్యాయులను సభకు పరిచయం చేసే కార్యక్రమాన్ని కువైట్ నుంచి సుధాకర్ రావు, ఖతార్ నుంచి శ్రీ సుధ, శిరీష, బెహరైన్ నుంచి జగదీశ్, పుజైరియా నుంచి మంజుల, అబుధాబి నుంచి విజయప్రసాద్, ఒమన్ నుంచి చైతన్య సూరపనేని, అరుంధతి, శ్రీదేవి నిర్వహించారు. గల్ఫ్ దేశాల్లోని ఉపాధ్యాయులు ప్రసంగించి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరినీ అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.