తెలంగాణ

telangana

ETV Bharat / state

'గల్ఫ్​ దేశాలకు వెళ్లేవారికి కనీస వేతనాలిచ్చేలా ఒప్పందాలుండాలి'

గల్ఫ్​ దేశాలకు వెళ్లే భారతీయులకు కనీస వేతనాలు ఉండేలా ఒప్పందాలు ఉండాలని మైగ్రంట్స్​ రైట్స్​ అండ్​ వెల్ఫేర్​ ఫోరం అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు కోరారు. ఈ మేరకు లోక్​సభ తెరాస పక్షనేత నామ నాగేశ్వర రావును హైదరాబాద్​లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. గల్ఫ్​ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నామను కోరారు.

gulf labour association met with trs mp nama nageshwara rao in hyderabad
'గల్ఫ్​కు వెళ్లేవారికి కనీస వేతనాలిచ్చేల ఒప్పందాలుండాలి'

By

Published : Dec 23, 2020, 6:20 PM IST

Updated : Dec 23, 2020, 7:09 PM IST

మైగ్రంట్స్​ రైట్స్​ అండ్​ వెల్ఫేర్​ ఫోరం అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు ఆధ్వర్యంలో ప్రవాస కార్మిక నాయకులు తెరాస పక్షనేత నామ నాగేశ్వర రావును హైదరాబాద్​లో కలిశారు. గల్ఫ్​ దేశాలకు వెళ్లే భారతీయులకు కనీస వేతనాలు ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నారు. గల్ఫ్​ దేశాల ప్రభుత్వాలు నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకున్నా.. భారత ప్రభుత్వం రిక్రూటింగ్​ ఏజెన్సీలు, విదేశీ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి భారత ప్రవాసీ కార్మికులకు అన్యాయం చేస్తోందని నామకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు, అధ్యయనం చేయకుండా ఏకపక్షంగా గల్ఫ్​ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నామను కోరారు.

కార్మికుల సమస్యపై కేంద్రమంత్రికి లేఖ రాయటంతో పాటు పార్లమెంట్​ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం లేవనెత్తుతాను. కరోనాతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు శాపంగా మారాయి. కేంద్రం వీటిని వెంటనే రద్దు చేయాలి.

నామ నాగేశ్వర రావు, లోక్​సభ తెరాస పక్షనేత

ఖతార్​, బహ్రెయిన్​, ఒమన్​, యూఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 డాలర్లు(రూ.15 వేలు), కువైట్​ 245 డాలర్లు, సౌదీ అరేబియా 324 డాలర్లకు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓవర్సీస్​ ఎంప్లాయిమెంట్​ అండ్​ ప్రొటెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఎమిగ్రంట్స్​ డివిజిన్​లోని డైరెక్టర్​ స్థాయి అధికారుల పేరిట సెప్టెంబర్​ 8న, 21న రెండు వేర్వేరు సర్య్కులర్లు జారీ చేశారు.

ఇదీ చదవండి:లోన్​యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన ఆర్‌బీఐ

Last Updated : Dec 23, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details