'స్నేహ మిలాన్' పేరిట ఏడాదికి నాలుగు సార్లు గుజరాతీలు వేడుకను జరుపుకుంటారు. కృష్ణాష్టమి, హోళీ, రాఖీ, దీపావళి రోజుల్లో... ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తారు. పనిలో ఎంత బిజీగా ఉన్నా.... ఈ కార్యక్రమానికి మాత్రం కచ్చితంగా హజరై.... సభ్యులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతారు. ఈసారి దీపావళి స్నేహమిలాన్(sneh milan)ను రామోజీ ఫిల్మ్‌సిటీ(Ramoji Film city news)లో ఎంతో వైభవంగా నిర్వహించారు.
రామోజీఫిల్మ్‌సిటీలో స్నేహమిలాన్
70, 80 ఏళ్ల క్రితమే చాలా మంది గుజరాతీలు ఇక్కడకు వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా కొన్నేళ్లకు 'ది గుజరాత్ సోషల్ వెల్‌ఫేర్ సొసైటీ'ని ఏర్పాటు చేసి... ఈ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొసైటీ సభ్యత్వం తీసుకున్న గుజరాతీలకు ప్రభుత్వ పథకాల్లానే ఎన్నో స్కీంలు పెట్టి ఆదరిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సొసైటీ 37సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున….. స్నేహమిలాన్‌ను రామోజీఫిల్మ్‌సిటీలో నిర్వహించినట్లు సంఘం అధ్యక్షుడు జిగ్నేష్ దోసి తెలిపారు.
మా ది గుజరాత్ సోషల్ వెల్‌ఫేర్ సొసైటీ(The Gujarat Social Welfare Society)'లో దాదాపు 3వేల 500 మంది ఉన్నారు. ఎవరికైనా లోన్ కావాలంటే తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు. ఎవరైనా చనిపోతే... 24 గంటల్లో వారి కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తాం. ఆడపిల్ల పుడితే లక్ష 31వేల రూపాయలు అందిస్తాం. ఆడబిడ్డ పెళ్లికి 21 వేల రూపాయలు ఇస్తున్నాం. సోసైటీలో ఉన్నవారికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది.
- జిగ్నేష్ దోసి, సంఘం అధ్యక్షుడు