కరోనా నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసేందుకు రాష్ట్ర ఎన్నిలక సంఘం నిబంధనలు విడుదల చేసింది. నవంబర్ 1 తరువాత నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. సైనిక సంస్థల్లో పని చేసేవారు, వారి సతీమణులు, జైళ్లలో ఉన్న ఖైదీలకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. ఎన్నికల విధుల్లోని సిబ్బంది, వికలాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటుకు నిబంధనలు ఇవే... - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ఓటుపై ఎస్‌ఈసీ నిబంధనలు విడుదల చేసింది. నవంబర్1 తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వారికి బ్యాలెట్ కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్లు ఆర్వోకు, ఆన్ లైన్లోఎన్నికల సంఘం వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్లు ఆర్వోకు, ఆన్ లైన్లోఎన్నికల సంఘం వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తుతో పాటు గుర్తింపు కార్డు నకలు, ఫొటో, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని పేర్కొన్నారు. నవంబర్ 1 తర్వాత ఎవరైన కరోనా బారీన పడితే పాజిటివ్ రిపోర్ట్‌తో పాటు ఆధార్, ఫొటో జతచేసి సమర్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఆమోదం పొందిన వారు... పోలింగ్ కేంద్రానికి అనుమతి లేదని.. ఎన్నికలకు 7 రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఇదీ చదవండి :పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం