తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో మార్గదర్శకాలు విడుదల చేసింది. మృతదేహం ఉన్న వాహనంలో ఆరుగురు మాత్రమే ప్రయాణించాలి. డ్రైవర్‌, ఒక సహాయకుడు, మృతుని బంధువులు నలుగురు వెళ్లొచ్చు. వారు ఎన్‌95 సర్జికల్‌ గ్లౌస్‌ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Guidelines for corona death funerals in telangana
కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

By

Published : Apr 4, 2020, 8:31 AM IST

Updated : Apr 4, 2020, 11:10 AM IST

కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్‌ బాధితుల మృతదేహాలను భద్రపర్చి, మార్గదర్శకాల ప్రకారం సిద్ధంచేసి వారి స్వగ్రామాలకు తరలించేందుకు మార్చురీ ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల ఫ్రొపెసర్లు డాక్టర్‌ తకియుద్దీన్‌, డాక్టర్‌ ఠాగూర్‌సింగ్‌తో పాటు మరి కొందరు అధికారులతో కమిటీని వేసింది. కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలు ఎలా చేయాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయం చేసి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి మెమోను జారీ చేసింది.

మృతదేహం ఉన్న వాహనంలో ఆరుగురు మాత్రమే ప్రయాణించాలి. డ్రైవర్‌, ఒక సహాయకుడు, మృతుని బంధువులు నలుగురు వెళ్లొచ్చు. వారు ఎన్‌95 సర్జికల్‌ గ్లౌస్‌ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అంత్యక్రియల సమయంలో వాడే పరికరాలను ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి. ఖననం చేస్తే.. ఎనిమిది అడుగుల లోతున పూడ్చాలి. ఈ సమయంలో కూడా మొత్తం భాగంలో హైపో సోడియం క్లోర్లైడ్‌ పిచికారీ చేయాలి.

ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఇతర మార్గదర్శకాలన్నింటినీ పాటించాలి.

ఇదీ చూడండి:'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

Last Updated : Apr 4, 2020, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details