తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయే వరకు తాము ప్లాస్మాను కొవిడ్ రోగులకు అందించేందుకు పని చేస్తామని తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో ప్లాస్మాకు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. అవసరాలు ఎక్కువ.. లభ్యత తక్కువగా ఉండటంతో అడిగిన ప్రతి ఒక్కరికీ ప్లాస్మా అందించలేకపోతున్నామని తెలిపారు.
'కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేవరకు 'ప్లాస్మా' సేవలు కొనసాగిస్తాం'
కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో ప్లాస్మాకు డిమాండ్ బాగా పెరిగిందని తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి పేర్కొన్నారు. లభ్యత తక్కువగా ఉండటంతో అడిగిన ప్రతి ఒక్కరికీ ప్లాస్మా అందించలేకపోతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు తాము ఈ సేవలను అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మొదటి వేవ్‌లో తాము దాదాపు 4 వేల మంది కొవిడ్ రోగులకు ప్లాస్మా సమకూర్చగలిగామని నారాయణరెడ్డి వివరించారు. సెకండ్ వేవ్‌లో ప్లాస్మాకు డిమాండ్ పెరిగిందని.. ప్రతిరోజు వంద వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. http://www.telanganaplasmadonors.comలోనూ 50 నుంచి 60 మంది నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. రెండో వేవ్‌లో తాము ఇప్పటి వరకు సుమారు 600 మందికి ప్లాస్మా సమకూర్చగలిగామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 8 మంది సభ్యులతో తాము స్వచ్ఛందంగా ఈ సేవలు అందిస్తున్నామని.. అవసరమైతే మరింత మందిని నియమించుకుని నిరంతరాయంగా సేవలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.