తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి'

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్సను చేరుస్తూ ముఖ్యమంత్రి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు పరిశీలన చేస్తున్నట్లు ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారని.. రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

'ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి'
'ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి'

By

Published : Sep 24, 2020, 10:57 PM IST

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్సను చేరుస్తూ ముఖ్యమంత్రి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ ముట్టడించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడబోదని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు పరిశీలన చేస్తున్నట్లు ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారని.. రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో కొవిడ్ కేసులు గురువారానికి 1.80 లక్షలకు చేరుకోగా, ఇప్పటి వరకు 1,070 మంది ప్రాణాలు కోల్పోయారని నారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు మిలియన్ మార్కును తాకే వరకు, మరణాలు లక్ష దాటేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేచి చూస్తారా అని ప్రశ్నించారు. పాజిటివ్‌ అని తేలితే చికిత్స ఖర్చుకు భయపడే... చాలా మంది పేదలు కొవిడ్ పరీక్షలు చేయించుకోడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చి కరోనాకి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్సను అందిస్తే.. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు ఒక్కొక్కరూ సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు ఖర్చు చేసి ఉంటారని.. ఈ లెక్కన కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము ఆవిరైపోయిందని నారాయణ రెడ్డి విమర్శించారు. కరోనా చికిత్స కోసం వేలాది కుటుంబాలు తమ పొదుపుల సొమ్ము వాడుకోవడం, ఆస్తులను తనఖా పెట్టడం, ఆభరణాలను విక్రయించడం, పెద్ద ఎత్తున అప్పులు చేయడం లాంటి వాటి ద్వారా వైరస్‌ నుంచి గటెక్కారన్నారు. అదే ఆరోగ్యశ్రీ క్రింద కరోనా చికిత్సను మొదట్లోనే చేర్చి ఉంటే వేలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేవి కావని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆత్మ సంతృప్తి కోసమే ప్లాస్మా దాతల సంఘం: గూడూరు

ABOUT THE AUTHOR

...view details