తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా వినతులు స్వీకరించేందుకు కేటీఆర్ సమయం కేటాయించాలి' - మంత్రి కేటీఆర్ ఆస్క్​ కార్యక్రమాన్ని తప్పుబట్టిన గూడూరు నారాయణ రెడ్డి

మంత్రి కేటీఆర్‌కు ట్వీట్టర్​లో ఎన్ని ప్రశ్నలు వచ్చినా ముందే ఎంపిక చేసుకున్న వాటికి మాత్రమే ప్రత్యుత్తరాలు ఇస్తారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్​ చేపట్టిన ఆస్క్​ కార్యక్రమంను విమర్శించారు. ఆయన ఆలోచనలను మార్పు చేసుకుని ప్రజలకు మంచి సేవలందించాలన్నారు.

guduru narayana reddy comment on KTR should take time to receive public requests
'ప్రజా వినతులు స్వీకరించేందుకు కేటీఆర్ సమయం కేటాయించాలి'

By

Published : Aug 9, 2020, 8:29 PM IST

సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ట్వీట్టర్​లో మంత్రి కేటీఆర్ చేపట్టిన ఆస్క్ ప్రచారాన్ని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌కు ఎన్ని ప్రశ్నలు వచ్చినా...ముందే ఎంపిక చేసుకున్న వాటికి మాత్రమే ప్రత్యుత్తరాలు ఇస్తారని విమర్శించారు. ప్రజా వినతులు స్వీకరించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా నిర్ణీత సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రిగా కార్యాలయంలో కానీ, ఇంటివద్ద కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పరిణతి చెందిన మంత్రిగా పనిచేయాలన్నారు.

ఆ కార్యక్రమం వార్తా పత్రికల్లో వార్తలు రాసుకోవడానికి పనికొచ్చే పబ్లిక్ స్టంట్‌ తప్ప మరోకటి కాదని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటానికి కాకుండా ప్రజలకు సేవలు అందించే విధంగా కేటీఆర్ పనిచేయాలని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తక్షణమే తన కార్యాలయ అడ్రసు మీడియాకు తెలిపి జనాలకు తెలిసేట్లు చూడాలని హితవు పలికారు.

ఇదీ చూడండి :ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details