తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాసిరకం పీపీఇ కిట్ల సరఫరాపై సమగ్ర దర్యాప్తు చేయాలి' - గూడూరు నారాయణ రెడ్డి తాజా వార్తలు

వైద్య సిబ్బందికి నాణ్యత లేని పీపీఇ కిట్లు సరఫరా చేసే వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమార్కులపై క్రిమినిల్​ కేసులు నమోదు చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.

gudur narayana reddy demand to investigate on supply of defective ppe kits in telangana
నాసిరకం పీపీఇ కిట్ల సరఫరాపై సమగ్ర దర్యాప్తు చేయాలి

By

Published : Sep 6, 2020, 7:12 AM IST

కరోనా యోధులకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందికి తగినన్ని పీపీఇ కిట్లు సరఫరా చేయడంలేదని.. వాటిల్లో ఏమాత్రం నాణ్యత లేదన్నారు. కిట్ల సేకరణ, సరఫరాపై వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్​ చేశారు. వారిపై మర్డర్ కేసులు నమోదు చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలో అత్యధిక కొవిడ్ పాజిటివిటీ రేటున్న రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఆరోగ్య కార్యకర్తల్లో వ్యాధి సంక్రమణ రేటు ఎక్కువగా ఉందన్నారు. కరోనా యోధులకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైరస్​ బారిన పడి పలువురు వైద్యులు, ఆర్యోగ కార్యక్తరలు మరణించారని... ఈ మరణాలకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఇవీ చూడండి:మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details