తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడిమల్కాపూర్​ మార్కెట్​ను తాకిన కరోనా - gudimalkapur market will be closed

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​ హోల్​సేల్​ మార్కెట్​ను కరోనా తాకింది. ఇక్కణ్నుంచి కూరగాయలు తీసుకెళ్లిన ఓ చిరువ్యాపారికి మహమ్మారి సోకడం వల్ల మూడ్రోజుల పాటు మార్కెట్​ను మూసివేస్తున్నట్లు కమిటీ ఛైర్మన్​ వెంకట్ రెడ్డి తెలిపారు.

gudimalkapur market will be closed three days due to corona effect
గుడిమల్కాపూర్​ మార్కెట్ మూసివేత

By

Published : May 4, 2020, 1:59 PM IST

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​ హోల్​సేల్​ మార్కెట్​ను కరోనా తాకింది. ఇక్కడి మార్కెట్​లో కూరగాయలు కొనుగోలు చేసి బయట విక్రయించే చిరు వ్యాపారికి వైరస్ సోకడం వల్ల అధికారుల్లో ఆందోళన నెలకొంది.

మార్కెట్​లోని ఓ కమిషన్ ఏజెంట్ దగ్గర సదరు వ్యక్తి వారం రోజుల క్రితం పచ్చి మిర్చి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దుకాణం తో పాటు పక్కనున్న మరో ఐదు దుకాణాలను మార్కెట్ కమిటీ ఆదివారం మూసి వేయించింది.

గుడిమల్కాపూర్ మార్కెట్​ను సందర్శించిన వ్యక్తికి కరోనా సోకడం వల్ల రేపటి నుంచి మూడ్రోజుల పాటు (మే 5-మే 7) మార్కెట్​ను మూసి వేయనున్నట్లు కమిటీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ మూడు రోజుల్లో మార్కెట్​ను రసాయనాలతో శుద్ధి చేస్తామని తెలిపారు.

మే 7 తర్వాత గుడిమల్కాపూర్ మార్కెట్​లో అమ్మకాలు మొదలవుతాయని స్పష్టం చేశారు. అంతవరకు రైతులు, కొనుగోలుదారులు మార్కెట్​కు రావద్దని విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details