కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం యూవీ క్రియేషన్స్ సంస్థ పై దాడులు చేసి చేసింది. ఆ సంస్థ నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెల్లిస్తున్న జీఎస్టీకి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. నిఘా విభాగం డిప్యూటీ కమిషనర్ వైశాలి మల్హోత్రా నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో ఆరు కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించాల్సి ఉందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఆ సంస్థకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ సంస్థ నిర్వహించిన వ్యాపార లావాదేవీలు, చెల్లించిన జీఎస్టీ లపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందో తెలుస్తుందని తెలిపారు.
యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు - యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు
GST department raids on UV creations office
08:34 November 02
యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు
Last Updated : Nov 2, 2022, 11:03 AM IST