తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి రూ.269కోట్ల జీఎస్టీ పరిహారం - తెలంగాణకు జీఎస్టీ మొత్తం విడుదల

జీఎస్టీ పరిహారం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి తాజాగా రూ. 269 కోట్లు విడుదలయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి జీఎస్టీ పరిహారము కింద రూ. 2,535 కోట్లు అందాయి.

gst due: centre releases rs 269 crore
రాష్ట్రానికి రూ.269కోట్ల జీఎస్టీ పరిహారం

By

Published : Apr 9, 2020, 7:28 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తితో అల్లాడుతున్న రాష్ట్రాలకు ఉపశమనం కల్పించేందుకు అన్ని అవకాశాల్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. జీఎస్టీ పరిహారం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి తాజాగా రూ. 269 కోట్లు విడుదలయ్యాయి. డిసెంబరు, జనవరి నెలలకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలను కూడా త్వరలోనే దశల వారీగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన రూ.2,266కోట్లకి తాజాగా విడుదలైన రూ.269 కోట్లు కలిపి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి జీఎస్టీ పరిహారము కింద రూ. 2,535 కోట్లు అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐదు విడతలుగా కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం అందింది. 2019 జూలైలో రూ.175 కోట్లు, ఆగస్టులో రూ. 700 కోట్లు డిసెంబర్లో రూ.1036 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 355 కోట్లు, పరిహారం వచ్చింది.

మార్చి నెలకు సంబంధించి రూ. 269 కోర్టు విడుదలైంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017-18 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రం కేవలం రూ.169 కోట్లు మాత్రమే పరిహారం అందుకుంది.

ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'

ABOUT THE AUTHOR

...view details