రాష్ట్రంలో భూములు, భవనాల క్రయవిక్రయాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. కొవిడ్ నిబంధనల సడలింపుతో మే 11నుంచి రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 80 రోజుల్లోనే దాదాపు రూ.3.50 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా రూ.1,005 కోట్లు, ఈ-స్టాంపుల అమ్మకం ద్వారా మరో రూ.1,079 కోట్ల రాబడి వచ్చింది. రెండూ కలిపితే రూ.2,133 కోట్లు మేర రాబడి ప్రభుత్వానికి వచ్చింది.
పెరుగుతోన్న రిజిస్ట్రేషన్‌లు.. సర్కారుకు భారీగా ఆదాయం - పెరుగుతోన్న రిజిస్ట్రేషన్‌లు.. సర్కారుకు భారీగా ఆదాయం
కరోనా విపత్కర సమయంలోనూ రోజుకు రూ.25 నుంచి 30 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది రిజిస్ట్రేషన్‌ల శాఖ. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతుండటం వల్ల రాబడులూ అదే స్థాయిలో వస్తున్నాయి. ఒక్క జులై నెలలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు రూ.750 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఒక్క జులై నెలలోనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.355 కోట్లు, ఈ-స్టాంపుల విక్రయాల ద్వారా మరో రూ.388 కోట్లు రాబడి వచ్చింది. రెండింటి ద్వారా దాదాపు రూ.750 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇదిలా ఉండగా.. ముందుగా స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన తేదీ, సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. మూడింట ఒక వంతు మేర రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ విధానంలో జరుగుతున్నాయి. ఈ 80 రోజుల్లో 1.08 లక్షల మంది స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఇదీచూడండి: ఆరు ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తాం: ఈటల