ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)కు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో... రాష్ట్రంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8వేల 400 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికి 35 కోట్ల రూపాయల రాయితీ అందజేసినట్లు లెక్కలు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)కు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, లైఫ్‌టాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం వల్ల వినియోగదారులు వీటి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఛార్జింగ్ స్టేషన్లు...
కేంద్రప్రభుత్వ ఈవీ ఫర్ ఎనర్జీ (Ev For Energy) పాలసీని కచ్చితంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో.. రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ, ఛత్తీస్‌గఢ్ నాలుగు రహదారులను ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)తో ఇంటిగ్రేడ్ చేసేలా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని రెడ్కో శాఖను సర్కార్ ఆదేశించింది. ఇండియన్ ఆయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఎన్హెచ్ఐఏఐ (NHIAI), ఆర్అండ్బీ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సూచనలు చేసింది.
ఇబ్బందులు తలెత్తకుండా...