ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రూపు-1 పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థుల కోసం... తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంయుక్త కార్యదర్శి, పోటీ పరీక్షల రంగ నిపుణులు నూతనకంటి వెంకట్ అందజేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సెంటర్ యూనివర్సిటీ గ్రంథాలయానికి ఈ పుస్తకాలు అందజేశారు.
జయశంకర్ వర్సిటీకి గ్రూపు-1 పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత - జయశంకర్ యూనివర్సిటీ తాజా వార్తలు హైదరాబాద్
గ్రూపు-1 పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలను తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంయుక్త కార్యదర్శి నూతనకంటి వెంకట్... జయశంకర్ వర్సిటీకి అందజేశారు. ఈ పుస్తకాన్ని గ్రూపు -1 సిలబస్‌ను పరీక్షల కోణంలో స్పష్టంగా విశ్లేషించడంతోపాటు ప్రీవియస్, నమూనా ప్రశ్నలు అంశాల వారీగా చేర్చి రూపొందించినట్టు యూనివర్సిటీ లైబ్రేరియన్ ఎస్. పి. రవికుమార్ తెలిపారు.

జయశంకర్ వర్సిటీకి గ్రూపు-1 పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత
ఈ పుస్తకంలో గ్రూపు -1 సిలబస్‌ను పరీక్షల కోణంలో స్పష్టంగా విశ్లేషించి, నమూనా ప్రశ్నలు అంశాల వారీగా చేర్చి... రూపొందించినట్టు యూనివర్సిటీ లైబ్రేరియన్ ఎస్. పి. రవికుమార్ తెలిపారు. గ్రూపు-1లో సులభంగా విజయం సాధించడానికి వ్యవసాయ పట్టభద్రులైన అభ్యర్థులకు అనేక విధాలుగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి వి. సుధాకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆ చాయ్ దుకాణమే 'నీట్' పుస్తకాల నిలయం