తెలంగాణ

telangana

ETV Bharat / state

Group 4 Exam Telangana : రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష - Telangana Jobs News

Group 4 Exam 2023 Telangana : తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు రాసిన గ్రూప్-4 కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్‌ 2 పరీక్ష జరిగింది. పరీక్షకు 15 నిమిషాల ముందుగానే అధికారులు గేట్లు మూసివేశారు.

Group 4
Group 4

By

Published : Jun 30, 2023, 6:25 PM IST

Updated : Jul 1, 2023, 5:08 PM IST

Group 4 Exam Telangana 2023 Today :రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. వారందరినీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే.. లోనికి అనుమతించారు. 15 నిమిషాల ముందే గేట్లు మూసివేశారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8 వేల 180గ్రూప్-4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ జరిగింది.

Telangana Group 4 exam Today : హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు చూపించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుగానేవెల్లడించింది. హాల్‌టికెట్​పై ఫొటో లేకపోతే.. గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న మూడు ఫొటోలతో రావాలనిటీఎస్​పీఎస్సీ సూచించింది. అభ్యర్థులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. వాచ్​లు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు, మొబైల్ వంటి వాటిని అనుమతించలేదు.

TSPSC Group 4 Exam Today : అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ ధరించవద్దని నిబంధన పెట్టారు. ఓఎంఆర్ షీటుపై బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని టీఎస్​పీఎస్సీ తెలిపింది. పెన్సిల్, జెల్, ఇంకు పెన్ను వాడితే జవాబు పత్రాన్ని ఆప్టికల్ మార్క్ స్కానర్ సిస్టం గుర్తించదని తెలిపింది. గతంలో జరిగిన పలు నియామక పరీక్షల్లో బబ్లింగ్ పొరపాట్లు వల్ల వందల మంది అనర్హులయ్యారు. ఈ నేపథ్యంలో ఓఎంఆర్ షీటుపై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని.. వెబ్ సైట్‌లోని మోడల్ ఓఎంఆర్ షీటు డౌన్ లోడ్ చేసుకొని ప్రాక్టీసు చేయాలని టీఎస్​పీఎస్సీ సూచించింది.

వైట్ నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్​తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే ఓఎంఆర్ షీటును మూల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది. ఒకరి బదులు మరొకరు రాసినా.. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది.

ముఖ్యమైన విషయాలు..:

  • 8,180 గ్రూప్ 4 పోస్టుల కోసం 9,51,321 మంది దరఖాస్తు
  • ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్ 1 (జనరల్ స్టడీస్)
  • మ.2.30 నుంచి సా.5గం. వరకు పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
  • ఉ. 8గం. నుంచి కేంద్రాల్లోకి అనుమతి, ఉ.9.45కు గేట్లు మూసివేత
  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కేంద్రాల్లోకి అనుమతి, 2.15కి గేట్లు మూసివేత
  • హాల్‌టికెట్, గుర్తింపు కార్డు పరిశీలన, తనిఖీల తర్వాతే కేంద్రంలోకి అనుమతి
  • వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌, పర్సులకు అనుమతి లేదు
  • అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలి.. షూ ధరించవద్దు
  • వెబ్‌సైట్‌లోని నమూనా ఓఎంఆర్‌ షీటులో బబ్లింగ్ ప్రాక్టీసు చేయాలని టీఎస్పీఎస్సీ సూచన
  • బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి
  • జెల్, ఇంకు పెన్ను, పెన్సిల్ వాడితో స్కానర్ గుర్తించదు
  • వైట్ నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్ తో బబ్లింగ్‌ దిద్దితే ఓఎంఆర్ షీటు చెల్లదు
  • అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసు, శాశ్వత డీబార్

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2023, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details