తెలంగాణ

telangana

ETV Bharat / state

Group 2 Exams Telangana 2023 : గ్రూప్-2 పరీక్షకు TSPSC ఏర్పాట్లు.. త్వరలో ఆ ఫలితాలు.! - వచ్చే వారంలో గ్రూప్ 4 రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల

Group 2 Exams Telangana 2023 : గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహణకు టీఎస్​పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష జరగనుంది. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర విషయాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్ సమావేశాలు నిర్వహించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్ టికెట్లు జారీ చేయనుంది.

TSPSC Arrangements for Group 2 Exams 2023
TSPSC

By

Published : Aug 8, 2023, 9:03 AM IST

Group 2 Exams Telangana 2023 :తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష తర్వాత అత్యంత కీలకమైన గ్రూప్‌-2 రాతపరీక్ష నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర విషయాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్‌ సమావేశాలు నిర్వహించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్లు(Group 2 Hall Tickets) జారీ చేయనున్నట్లు తెలిపింది.

TSPSC Group 2 Exam Update : 783 గ్రూప్ -2 పోస్టులకు 5లక్షల 51 వేల 943 మంది దరఖాస్తు చేశారు. ఎంపిక పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలో టీఎస్​పీఎస్సీ నిర్వహించనుంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించేందుకు కంప్యూటర్ ఆధారిత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో డబుల్‌ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో ఫలితాల వెల్లడికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షలలో ఎలాంటి సమస్యలు, వివాదాలకు ఆస్కారం లేకుండా కసరత్తు చేస్తోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

కేంద్ర ప్రభుత్వంలో 1207 ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం.. అప్లై చేసుకోండిలా..

Group 2 Exams Arrangements Telangana 2023 : తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కళాశాలలకు జిల్లా విద్యాధికారులు, ఇంటర్‌బోర్డు ద్వారా సమాచారం పంపించింది. ఆయా విద్యాలయాలకు ఆ రెండురోజులు సెలవులు ప్రకటించింది. వారాంతపు సెలవుల్లో పరీక్ష(Group 2 Exams 2023) నిర్వహించాలని భావించినప్పటికీ, అప్పటికే వేర్వేరు కేంద్ర ప్రభుత్వ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో సాధారణ పనిదినాల్లో అయినా పరీక్షలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ షెడ్యూలును విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. పరీక్ష నిర్వహణ పూర్తయ్యాక.. ప్రిలిమినరీ కీని సెప్టెంబరులోగా ప్రకటించనుంది.

Telangana SI Results Released : తెలంగాణ ఎస్​ఐ తుది ఫలితాలు విడుదల

TSPSC Group 4 Exam Preliminary Key :జులై 1న 8 వేలకు పైగా గ్రూప్‌-4(TSPSC Group 4 Exam) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక కీని వచ్చే వారంలో వెలువరించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తిచేసింది. గ్రూప్‌ 4 పరీక్షకు 7.6 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అభ్యంతరాల అనంతరం తుది కీని ఖరారు చేసి, ఫలితాలు వెల్లడించనుంది.

TSPSC Group 1 Results 2023 :మరోవైపు టీఎస్​పీఎస్సీగ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలుప్రకటించిన తేదీ నుంచి ప్రధాన పరీక్షలకు కనీసం మూడు నెలల సమయమివ్వాలని భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష తుది కీ(Group 1 Preliminary Key)ని ఇప్పటికే వెల్లడించినా.. ఫలితాల ప్రకటనకు పలు న్యాయవివాదాలు అడ్డుగా ఉన్నాయి. జీవో నం 55పై, రోస్టర్‌పై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ న్యాయవివాదాలపై వచ్చే వారానికి హైకోర్టు(Telangana High court on Group 1 Exam) నుంచి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అడ్డంకులు తొలగిపోతే వెంటనే ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడించడంతో పాటు, ప్రధాన పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్- 2,3, 4 లో మరికొన్ని పోస్టులు చేర్చిన సర్కార్‌

ABOUT THE AUTHOR

...view details