తెలంగాణ

telangana

ETV Bharat / state

Group-2 Candidates Petition in Telangana HighCourt : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Group-2 exam in telangana
Group-2 Candidates Petition in High Court

By

Published : Aug 10, 2023, 1:19 PM IST

Updated : Aug 10, 2023, 3:25 PM IST

13:16 August 10

Group-2 Candidates Petition in Telangana HighCourt : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Group-2 Candidates Petition in Telangana HighCourt : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29, 30న తలపెట్టిన గ్రూప్-2 (Group-2 Exam)పరీక్షను వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున.. గ్రూప్ 2ను రీ-షెడ్యూల్ చేయాలని పిటిషన్‌లో కోరారు.

Group-2 Candidates protest in TSPSC Office : మరోవైపు గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం (TSPSC Office) ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయం నుంచి సుమారు 2,000 మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. వీరికి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్‌-2 అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, డాక్టర్ రియాజ్ తదితరులతో కలిసి అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు.

Telangana SI Results Released : తెలంగాణ ఎస్​ఐ తుది ఫలితాలు విడుదల

మరోవైపు గ్రూప్‌-2 రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేపర్లుగా ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర విషయాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్‌ సమావేశాలు నిర్వహించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.

మొత్తం 783 గ్రూప్ -2 పోస్టులకు గాను 5, 51,943 మంది దరఖాస్తు చేశారు. పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలోతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్నిర్వహించనుంది. ఈ క్రమంలోనే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించేందుకు కంప్యూటర్ ఆధారిత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపడుతోంది. గతంలో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో డబుల్‌ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో.. ఫలితాల వెల్లడికి దాదాపు రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షలో ఎలాంటి సమస్యలు.. వివాదాలకు ఆస్కారం లేకుండా టీఎస్‌పీఎస్సీ ప్రణాళికలు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వంలో 1207 ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం.. అప్లై చేసుకోండిలా..

ఈ పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కళాశాలలకు జిల్లా విద్యాధికారులు, ఇంటర్‌బోర్డు ద్వారా సమాచారం పంపించింది. ఆయా విద్యాలయాలకు ఆ రెండు రోజులు సెలవులు ప్రకటించింది. వారాంతపు సెలవుల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికి, అప్పటికే వేర్వేరు కేంద్ర ప్రభుత్వ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలోనే సాధారణ పనిదినాల్లో అయినా పరీక్షలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష నిర్వహణ పూర్తయ్యాక.. ప్రిలిమినరీ కీని సెప్టెంబరులోగా ప్రకటించనుంది.

Group 2 Candidates Protest Hyderabad : గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాల్సిందే.. TSPSC వద్ద అభ్యర్థుల నిరసన

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్- 2,3, 4 లో మరికొన్ని పోస్టులు చేర్చిన సర్కార్‌

Last Updated : Aug 10, 2023, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details