తెలంగాణ

telangana

ETV Bharat / state

'కారుణ్య మరణానికి అనుమతించండి' - GROUP 2 CANDIDATES ARE PROTEST

వాళ్లంతా విద్యావంతులే... అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసి ఎంపికయ్యారు. సర్కారు మాత్రం వారి ఫలితాలనూ ఇప్పటికీ వెలువడించలేదు. నిరుద్యోగులుగా ఉండలేక... వేరే ఉద్యోగం చూసుకోలేక... ఇప్పుడు వారంతా కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

కారుణ్య మరణానికి అనుమతి కోరిన మెరిట్ అభ్యర్థులు

By

Published : Mar 22, 2019, 1:09 PM IST

Updated : Mar 22, 2019, 3:23 PM IST

కారుణ్య మరణానికి అనుమతి కోరిన మెరిట్ అభ్యర్థులు
గ్రూప్​2 పరీక్ష రెండున్నరేళ్ల క్రితం తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ రాష్ట్రంలో నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా దీని ఫలితాలు ఇంకా వెలువడించలేదు. మెరిట్​ జాబితాలో పేర్లు ఉండి.. ఫలితాలు రాక గ్రూప్​2 అభ్యర్థులంతా మానసిక క్షోభకు గురవుతున్నట్లు చెబుతున్నారు.

పరీక్ష నిర్వహణ దశ నుంచి టీఎస్​పీఎస్సీ చేస్తోన్న తప్పిదాల వల్ల మెరిట్​ లిస్టులో స్థానం ఉన్నా... బాధితులుగా మారామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉద్యోగం రాక వేరే ఉద్యోగం చేయలేక ఇంటా బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ బతకడం కంటే చనిపోవడం మేలు అంటున్నారు. అందుకే కారుణ్య మరణానికి అనుమతి కోసం మానవ హక్కుల కమీషన్​ను ఆశ్రయించామని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి: నీరు జీవనాధారం.. సంరక్షించకుంటే తప్పదు నష్టం

Last Updated : Mar 22, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details