తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొవిడ్‌ నిబంధనలతో గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రారంభం! - గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు తాజా వార్తలు

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచి ఈనెల 20 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

group-1
ఏపీలో ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు!

By

Published : Dec 14, 2020, 11:51 AM IST

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించిన వారిని మాత్రమే కేంద్రాలలోకి అధికారులు అనుమతినిచ్చారు. నేటినుంచి ఈనెల 20 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్​లైన్ విధానంలో భాగంగా అభ్యర్థులకు తొలిసారిగా ట్యాబ్‌లో ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. అభ్యర్థి లాగిన్ అయ్యాక తెరపై ప్రశ్నాపత్రం కనిపించేలా ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో 312 మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు తెలిపారు. సకాలంలో రాని అభ్యర్థులను లోనికి అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి పైడి ఢిల్లీశ్వరరావు ఫోన్​నెంబర్​కు 90145 50915 సంప్రదించి నివృత్తి చే చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న దళితబస్తీ..!

ABOUT THE AUTHOR

...view details