తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుడితో పోలిస్తే పెరిగిన భూగర్భ జలమట్టం - తెలంగాణలో పెరిగిన భూగర్భజలాలు

నిరుడితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో భూగర్భ జలమట్టం పెరిగింది. సగటున రాష్ట్రంలో 2.93 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 8.35 మీటర్లుగా ఉంది.

Groundwater level,  telangana
భూగర్భజలమట్టం

By

Published : Apr 2, 2021, 7:49 AM IST

నిరుడు మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్రంలో భూగర్భ జలమట్టంలో పెరుగుదల ఉంది. సగటున రాష్ట్రంలో 2.93 మీటర్ల మేర పెరిగాయి. ఈ మేరకు భూగర్భ జలశాఖ వివరాలు వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 8.35 మీటర్లుగా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో 0.99 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి. 2021 మార్చిలో అత్యంత తక్కువ లోతులో 3.50మీటర్ల వద్ద వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు ఉండగా... అత్యంత ఎక్కువ దిగువన 14.87 మీటర్ల వద్ద మెదక్ జిల్లాలో ఉన్నాయి. భూపాలపల్లి, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ భూగర్భ జలాలు పదిమీటర్ల కంటే ఎక్కువ దిగువనే ఉన్నాయి.


ఇదీ చూడండి: బ్యాంకులో చోరీకి గురైన సొమ్ము విలువ రూ.3.10 కోట్లు: సీపీ

ABOUT THE AUTHOR

...view details